Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 10th June
x

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Highlights

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 10-06-2024 : సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : చవితి సా. గం.4.14 ని.ల వరకు, ఆతర్వాత పంచమి

నక్షత్రం: పుష్యమి రా.గం.9.40 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.54 ని.ల నుంచి గం.4.36 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.42 ని.లనుంచి గం.1.35 ని.ల వరకు మళ్లీ మ.గం.3.20 ని.ల నుంచి గం.4.12 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.20 ని.ల నుంచి గం.8.59 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.50 ని.లకు


మేషం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు. తల్లి పుట్టింటి వారితో సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శివుణ్ణి పూజించడం మేలు.


వృషభం :

సర్వత్రా శుభంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆత్మీయులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.


మిథునం :

తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులొస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోనూ చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. అమ్మవారిని పూజించండి.


కర్కాటకం:

మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది.


సింహం :

అనవసర ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు, ఆవేశాల వల్ల ఉద్యోగానికే ముప్పొచ్చే వీలుంది. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. ఆంజనేయ స్వామిని పూజించండి.


కన్య :

పనులన్నింటా విజయం సిద్ధిస్తుంది. మంచి అవకాశాలు అందివస్తాయి. స్థిరనిర్ణయం తీసుకోండి. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు.


తుల :

కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అవసరమైన సహకారాన్ని పొందుతారు. సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు ప్రతిభను కనబరుస్తారు. ఇంట్లో శాంతి ఉంటుంది.


వృశ్చికం :

పనులు సవ్యంగా సాగవు. శత్రుపీడ పెరుగుతుంది. బలహీనతలపై దెబ్బ కొడతారు.ఉద్యోగస్తులు మాట పడే సూచనలున్నాయి. అయినవారితోనూ విరోధం వస్తుంది. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని పూజించండి.


ధనుస్సు :

చెప్పుడు మాటలను వినకండి. దురాలోచనల వల్ల అనుమానాలు, తద్వారా తగాదాలు గోచరిస్తున్నాయి. పనులను అయిష్టంగా చేస్తారు. పెద్దల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. శివుడిని పూజించడం మేలు.


మకరం :

పనులు అనుకున్నట్లే సాగుతాయి. బంధాలు వృద్ధి చెందుతాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రయాణాలు ఉపయోగకరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.


కుంభం :

చేపట్టిన కార్యాలు జయప్రదమవుతాయి. ఆర్థిక చికాకులు తొలగుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


మీనం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర వాగ్వాదాల వల్ల మనోవ్యధ కలుగుతుంది. సంతానం శైలి చికాకు పరుస్తుంది. కీలక సమయాల్లో సొంత తెలివితేటలు వాడకండి. వృథా ఖర్చులు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories