Chandra Grahanam 2026: మార్చి 3 చంద్రగ్రహణం.. ఈ రాశులపై ప్రభావం ఎక్కువ


Chandra Grahanam 2026: మార్చి 3 చంద్రగ్రహణం.. ఈ రాశులపై ప్రభావం ఎక్కువ
Chandra Grahanam 2026: మార్చి 3న చంద్రగ్రహణం. సమయాలు, సంపూర్ణ గ్రహణ కాలం వివరాలు. మేష, కర్కాటక, సింహ, ధనుస్సు రాశులపై ప్రభావం, పరిష్కార సూచనలు.
మార్చి 3న తొలి చంద్రగ్రహణం
2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మంగళవారం రోజున సంభవించనుంది. అదే రోజు హోలీ పండుగ ఉండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు ముగియనుంది. సాయంత్రం 4.34 గంటల నుంచి 5.33 గంటల వరకు సంపూర్ణ గ్రహణ కాలంగా పేర్కొంటున్నారు.
గ్రహణ సమయంలో పూజలు, హోమాలు, శుభకార్యాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. గ్రహణం కొనసాగుతున్న సమయంలో హోలీ వేడుకలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి సాధారణ కార్యక్రమాలు ప్రారంభించవచ్చని తెలిపారు.
ఈ రాశులపై ప్రభావం ఎక్కువ
జ్యోతిష్యుల ప్రకారం ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, ధనుస్సు రాశులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మేష రాశి: మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న వివాదాలు పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. అనాలోచిత పెట్టుబడులు నష్టాలకు కారణమవవచ్చు.
సింహ రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అలసట, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: వాదనలు, గొడవలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు.
పరిష్కార సూచనలు
ప్రతికూల ప్రభావాలు తగ్గేందుకు “ఓం సోమాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించడం, పాలు, బియ్యం, మిశ్రీ వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇది జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తూ శాంతంగా ఉంటే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని పెద్దలు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



