Personal Things not to Share: పొరపాటున కూడా ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వకండి.. జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది

Personal Things not to Share
x

Personal Things not to Share: పొరపాటున కూడా ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వకండి.. జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది

Highlights

Personal Things not to Share: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో కొన్ని విషయాలను చాలా పవిత్రమైనవిగా, వ్యక్తిగతమైనవిగా భావిస్తారు. వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ వస్తువులను ఇతరులతో పంచుకోవడం లేదా ఇవ్వడం అశుభం.

Personal Things not to Share: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో కొన్ని విషయాలను చాలా పవిత్రమైనవిగా, వ్యక్తిగతమైనవిగా భావిస్తారు. వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ వస్తువులను ఇతరులతో పంచుకోవడం లేదా ఇవ్వడం అశుభం. అవి వేరొకరికి ఇస్తే మీ అద‌ృష్టం దూరమవుతుంది. అంతేకాకుండా, శ్రేయస్సు, శాంతిని ప్రభావితం చేస్తాయి. ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటి, ఎందుకు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

సింధూరం

సింధూరం వివాహిత స్త్రీ అదృష్టానికి చిహ్నం. దానిని వేరొకరికి ఇవ్వడం అశుభం. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.

మిగిలిపోయిన ఆహారం

మీ మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వడం అనాగరికంగా ఉంటుంది. ఇలా ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. కావాలంటే మీరు తినే ముందే ఆహారం ఇవ్వడం ఉత్తమం.

శుభ్రపరిచే వస్తువులు

చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దానిని ఎవరికైనా ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం, పేదరికం సంభవించవచ్చు. అంతేకాకుండా, ఇది ఇంటి శాంతి, ఆనందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ధరించిన దుస్తులు

మీరు వేసుకున్న బట్టను ఇతరులకు ఇవ్వడ మంచిది కాదు. ముఖ్యంగా లోదుస్తులు, నైట్‌వేర్ లేదా వ్యక్తిగత దుస్తులు ఇవ్వడం అశుభం.

వాచ్, హ్యాండ్ కర్చీఫ్

మీరు వాచ్ ఎవరికైనా ఇస్తే మీ జీవిత కాలచక్రం ప్రభావితమవుతుంది. హ్యాండ్ కర్చీఫ్‌ను ఇతరులకు ఇవ్వడం వల్ల మీ అనుబంధం దెబ్బతీంటుంది.

బూట్లు కాలి మెట్టలు

బూట్లు, చెప్పులు అపవిత్రమైనవి కాబట్టి మీరు వాడిన వాటిని ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు. అలా ఇవ్వడం వల్ల మీ అదృష్టానికి ఆటంకం కలుగుతుంది. మరోవైపు, కాలి మెట్టలు కూడా ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే అవి వివాహిత స్త్రీకి చిహ్నం. దానిని ఇతరులకు ఇవ్వడం చెడ్డ శకునంగా భావిస్తారు.

గాజులు

గాజులు వైవాహిక జీవితానికి చిహ్నం. మీరు ధరించిన గాజులను ఇతరులకు ఇవ్వడం వల్ల మీ వైవాహిక జీవితంలో చీలికలు లేదా అశాంతి ఏర్పడవచ్చు.

పసిపిల్లల బట్టలు

పసిపిల్లల బట్టలు చాలా పవిత్రమైన, సున్నితమైన శక్తిని కలిగి ఉంటాయి. వీటిని వేరొకరికి ఇవ్వడం వల్ల పిల్లల భద్రత, శక్తిపై ప్రభావం ఉంటుంది.

పెళ్లి బట్టలు

వివాహ దుస్తులు మీ జీవితంలోని అత్యంత శుభ క్షణంతో ముడిపడి ఉన్నాయి. దానిని వేరొకరికి ఇవ్వడం ద్వారా, మీ వైవాహిక జీవితంలోని శక్తిని మరొకరికి బదిలీ అవుతుంది.

మంగళసూత్రం

మంగళసూత్రం స్త్రీ వైవాహిక జీవిత రక్షణకు చిహ్నం. దీన్ని ఇతరులకు ఇవ్వడం అశుభం. అది వైవాహిక జీవితంలో సమస్యలను తెస్తుంది.

ఈ వస్తువులను వేరొకరికి ఇవ్వడం అనేది కేవలం సంప్రదాయం లేదా మూఢనమ్మకానికి సంబంధించిన విషయం కాదు, అవి మీ వ్యక్తిగత శక్తి, భావోద్వేగ అనుబంధం, అదృష్టానికి సంబంధించినవి. కాబట్టి,ఈ వస్తువులను ఇతరులతో పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories