Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజే గజకేసరి యోగం.. అదృష్టంతో ఈ 4 రాశుల జీవితం బంగారుమయం

Akshaya Tritiya
x

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజే గజకేసరి యోగం.. అదృష్టంతో ఈ 4 రాశుల జీవితం బంగారుమయం

Highlights

Akshaya Tritiya Lucky Signs: ప్రతి ఏడాది అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఇది పరమ పవిత్రమైన పండుగ. హిందువులు లక్ష్మీదేవి పూజ చేస్తారు.

Akshaya Tritiya Lucky Signs: ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన వస్తుంది. ఆ రోజు లక్ష్మీదేవి కుబేరుని పూజ చేస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసే నమ్మకం ఉంది. అయితే అక్షయ తృతీయ రోజు ఈ రోజు యోగాలు ఏర్పడతాయి. గజకేసరి యోగం, చతుర్గ్రాహి యోగం, మాలవ్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

అక్షయ తృతీయ లక్ష్మీ అనుగ్రహం వల్ల ఈ రాశులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అక్షయ తృతీయ రోజు రవి, సర్వార్ధ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగాల వల్ల అదృష్టం పట్టబోతున్న రాశులు ఏమో తెలుసుకుందాం.

మిథున రాశి..

అక్షయ తృతీయ రోజు మిథున రాశి వారికి అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో మంచి పేరుప్రఖ్యాతలు పొందుతారు. పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న అప్పుల ఊబి నుంచి బయటపడతారు.

తులారాశి..

తులారాశి వారికి కూడా అక్షయ తృతీయ నుంచి మంచి యోగాలు కలుగుతాయి. ఆదాయం వచ్చి పడుతుంది. ప్రధానంగా వీళ్లకు ఏర్పడే శుభయోగాల వల్ల సంపాద పెరుగుతుంది.

కుంభరాశి..

అక్షయ తృతీయ రోజు కుంభరాశి వారికి కూడా జీవితంలో గొప్ప సంపదలు చూస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఆర్థికంగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. వ్యాపారంలో భారీగా లాభాలు కూడా పొందుతారు.

మీన రాశి..

అక్షయ తృతీయ వల్ల మీన రాశి వారికి కూడా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా వీళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిన ఉద్యోగాల్లో మారుతారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని విజయం సాధిస్తారు. కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు అందిపుచ్చుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories