Religion News: మీ చెప్పులు ఎవరైనా దొంగిలించారా.. జ్యోతిష్యం ప్రకారం ప్రభావం ఎలా ఉంటుందంటే..?

According To Astrology If The Shoes Are Stolen Or Lost On Saturday One Will Get Rid Of The Troubles
x

Religion News: మీ చెప్పులు ఎవరైనా దొంగిలించారా.. జ్యోతిష్యం ప్రకారం ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Highlights

Religion News: హిందూమతంలో చాలా నమ్మకాలు ఉంటాయి. కొంతమంది వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తారు.

Religion News: హిందూమతంలో చాలా నమ్మకాలు ఉంటాయి. కొంతమంది వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రాచీన కాలం నుంచి ఈ నమ్మకాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇందులో ఒకటి బూట్లు, చెప్పుల చోరీ చేయడం. శనివారం ఆలయం దగ్గర విడిచిన చెప్పులు దొంగిలించబడినట్లయితే అది శుభసూచకానికి సంకేతమని చెబుతారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శనివారం ఆలయం దగ్గర విడిచిన బూట్లు, చెప్పులు దొంగిలించబడితే మీ చెడు సమయం ముగుస్తుందని అర్థం. భవిష్యత్‌లో మీ జీవితంలో ఆనందం, సంతోషం ఉంటుందని అర్థం. ఇది కాకుండా మీరు సమస్యల నుంచి బయటపడుతారని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు మానవుని పాదాలలో ఉంటాడని చెబుతారు. దీనివల్ల పాదరక్షలు, చెప్పులు శని కారకంగా మారతాయి. అందుకే ఎవరైనా పాదరక్షలు, చెప్పులు దొంగిలించినా లేదా దానం చేసినా శని దేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

కష్టాల నుంచి ఉపశమనం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉండి మంచి ఫలితాలను ఇవ్వకుంటే ఆ వ్యక్తి చేసిన పనిలో విజయం ఉండదు. ఈ పరిస్థితిలో బూట్లు, చెప్పులు శనివారం ఆలయం నుంచి దొంగిలిస్తే అది మీకు శుభసూచకం. దీనివల్ల మీ కష్టాలు త్వరగా తొలగిపోయి శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories