కల్వర్టును ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా

X
ఇమేజ్ సోర్స్ : గూగుల్
Highlights
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో కల్వర్టును ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది స్వల్ప గాయాలయ్యాయి
Kranthi23 Feb 2021 3:26 AM GMT
ప్రకాశం : రోజు తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో జరిగింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తుండగా చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలను చేపట్టారు. బాధితులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Web TitleThe private bus collided with a culvert and overturned
Next Story