Andhra Pradesh: ఏపీలో నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ

Zero Interest to Farmers Account in AP Today
x
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Andhra Pradesh: వడ్డీ రాయితీని జమ చేయనున్న సీఎం జగన్‌ * 2019-20లో రుణాలు తీసుకున్న 6.27 లక్షల మందికి వడ్డీ రాయితీ

Andhra Pradesh: సున్నా వడ్డీ పథకంతో రైతులకు చేయూతనిస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఇవాళ రెండో ఏడాది వడ్డీ రాయితీ జమ చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గతేడాది సున్నా వడ్డీ పంట రుణం ప్రారంభించారు సీఎం జగన్‌. లక్షలోపు రుణాలు తీసుకుని ఏడాదిలో చెల్లించిన వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2018-19 ఏడాదిలో లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు 11 వందల 32 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ విడుదల చేసింది ప్రభుత్వం. 2019-20లో రుణాలు తీసుకున్న 6 లక్షల 27 వేల మంది రైతులకు ఇవాళ 128 కోట్ల వడ్డీ రాయితీ ఇవ్వనుంది.

ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించగా.. ఆన్‌లైన్‌లో 2 లక్షల 50 వేల మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తోంది. మొత్తం 6 లక్షల 27 వేల మంది రైతుల ఖాతాల్లోకి.. సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా డబ్బుల్ని జమ చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories