YV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో ఉండాలి

YV Subba Reddy: దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి

Rama Rao
Published on: 29 May 2022 4:29 PM IST
YV Subba Reddy Said There was a Large Crowd of Devotees in Thirumala
X

YV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో ఉండాలి

YV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని తిరుమలకు రావాలని సూచించారు. తిరుమలకు భక్తులు రావద్దని చెప్పడం లేదన్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని సుబ్బారెడ్డి కోరారు.

Rama Rao

Rama Rao

Next Story