టైం, ప్లేస్‌ చెప్తే వస్తా: అంబటి రాంబాబు

టైం, ప్లేస్‌ చెప్తే వస్తా: అంబటి రాంబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద రావుపై వైసీపీ అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతిపై చర్చకు రావాలన్న...

ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద రావుపై వైసీపీ అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతిపై చర్చకు రావాలన్న కోడెల సవాల్‌ని స్వీకరిస్తున్నట్లు పత్రికాముఖంగా తెలిపారు. టైం, ప్లేస్‌ చెప్తే చర్చకు వస్తానని రాంబాబు స్పష్టం చేశారు. దుర్మార్గపు రాజకీయ చరిత్ర కలిగిన కోడెల స్పీకర్‌ పదవికి అనర్హుడని అన్నారు. ఓట్ల తొలగింపు కోసమే వైసీపీ సానుభూతిపరుల పేరు మీద ఫారం-7 అప్లికేషన్లు పెట్టారని ఆరోపించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి, నైతికత కోడెలకు లేదని కూడా అన్నారు గుంటూరులో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories