కరెంట్ బిల్లు చూసి కంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే..

కరెంట్ బిల్లు చూసి కంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రభుత్వం మాత్రం అదంతా అపోహలేనని టారిఫ్ ప్రకారమే బిల్లులు జారీ చేస్తున్నామంటోంది. అయితే ఈసారి వైసీపీ ఎమ్మెల్యేకు కూడా విద్యుత్ షాక్ తప్పలేదు.

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర ఇంటికి కూడా కరెంట్ బిల్లు తన ఇంటికి వచ్చిన సిబ్బందిపై అధికంగా వచ్చిందట. దీనిపై ఆయన విద్యుత్ అధికారులను ప్రశించారు. తాను కొత్తగా నిర్మించిన ఇంటికి ప్రతి నెలా బిల్లు చెల్లిస్తున్నాని.. కరోనా కారణంగా పనులు నిలిపివేసినా బిల్లు గతం కంటే ఎక్కువగా వచ్చిందన్నారు. అధికారులు సర్థిచెప్పే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేసారని సమాచారం.

కరెంట్ బిల్లులు అధికంగా రావడానికి కారణం మార్చి నెలలో గతేడాది టారిఫ్ ప్రకారం తీస్తున్నారని.. ఏప్రిల్‌ నెలలోడ్ బిల్లులను డైనమిక్‌ విధానం ద్వారా తీస్తున్నారన్నారు. ఈ డైనమిక్‌ విధానం ప్రకారం ఎంత విద్యుత్‌నువినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని అన్నారు. ప్రజలకు ఏవైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని దానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories