Top
logo

YSRCP: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంటులో కీలక పదవి

YSRCP: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంటులో కీలక పదవి
Highlights

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంటులో కీలక పదవి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంటులో కీలక పదవి

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంటులో కీలక పదవి దక్కింది. వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి వివిధ శాఖలకు ఛైర్మన్‌లను నియమిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ ప్రకటన విడుదల చేశారు.

శాఖల వారీగా చైర్మన్లు..

*ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా

*మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ

*జతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు

*వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయిరెడ్డి

*హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ

*పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్

*రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధామోహన్ సింగ్

*పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి

*కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్

*విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి

*ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ

*జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్

*కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి

*గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్

*బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్

*సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీఛైర్మన్ రమాదేవి

*శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్

*రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టీజీ వెంకటేష్

*ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్

*సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్

*వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్

*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్

*రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం

*విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్

Next Story

లైవ్ టీవి


Share it