Raghu Rama Krishnam Raju: రఘురామకృష్ణ రాజు విడుదల సోమవారమే?

MP Raghu Rama Krishnam Raju: (file image)
Raghu Rama Krishnam Raju: బెయిల్‌కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ లాయర్లకు అందని నేపథ్యంలో విడుదల ఆలస్యమైనట్లు సమాచారం.
Raghu Rama Krishnam Raju: దేవుడి వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లు.. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. ఇంకా రఘురామకృష్ణరాజు జైల్లోనే ఉన్నారు. అన్నీ కరెక్టుగా జరిగితే సోమవారంనాడు గాని ఆయన బయటకు రాలేరట. అధికారులు, ఎంపీ అడ్వకేట్లు చేసిన ఆలస్యాల వల్ల ఈ పరిస్ధితి వచ్చిందని అంటున్నారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు అందని నేపథ్యంలో రఘురామ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో న్యాయవాదులు ఎల్లుండి కింది కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఎంపీ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో తనను పోలీసులు కొట్టారని ఎంపీ జిల్లా కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ధర్మాసనం ఆదేశాల మేరకు రఘురామకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన హైకోర్టు బెయిల్ నిరాకరించడంపై సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగిన అనంతరం ఆయనకు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Milk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMT