దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే వసంత

దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే వసంత
x
Highlights

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. సీఎం జగన్ పై కానీ, వైసీపీ నాయకుల మీద కానీ...

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. సీఎం జగన్ పై కానీ, వైసీపీ నాయకుల మీద కానీ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కొంతకాలంగా దేవినేని ఉమా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాని ఆరోపణలు చేస్తున్నారు..

దేవినేని ఉమా లాగా ఇసుక వ్యాపారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. ప్రభుత్వంపై వెకిలిగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు. తీరు మార్చుకోకపోతే సరైన బుద్ది చెబుతామని, ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనుంచి తనపై నిరాధార ఆరోపణలు చేస్తే స్వయంగా మీ ఇంటికి వచ్చి కాలర్‌ పట్టుకుని నిలదీస్తా అంటూ దేవినేని ఉమా పై వ్యాఖ్యలు చేశారు కృష్ణప్రసాద్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories