శివప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా పరామర్శ

శివప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా పరామర్శ
x
Highlights

శివప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా పరామర్శ శివప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా పరామర్శ

ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నారుమలి శివప్రసాద్ కుటుంబాన్ని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం పరామర్శించారు. ముందుగా శివప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివప్రసాద్ భార్య రాజ్యలక్ష్మికి దైర్యం చెప్పారు. ఈ సందర్బంగా శివప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు రోజా. శివప్రసాద్‌ తనకు గురువుతో సమానం అన్నారు. సినిమాలు, రాజకీయాల్లోకి రావడానికి శివప్రసాద్ కారణమని వారితో అన్నారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories