ఆరు నెలల్లోనే ప్రజారంజక పాలన.. రోజా ట్విట్

ఆరు నెలల్లోనే ప్రజారంజక పాలన.. రోజా ట్విట్
x
file photo
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచాయి.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచాయి. దీంతో సీఎంగా ప్రమాణస్వీకారం రోజునా జగన్ తన ప్రసంగంలో ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటాని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యువతకు గ్రామ సచివాలయాల పేరుతో ఉద్యోగ కల్పనలోనూ, నవరత్నాల అమలుతో జగన్ దూసుకుపోతున్నారు. దీనిపై అధికార పక్ష ఎమ్మెల్యేలు సీఎంకు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా జగన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని జగనన్న తీసుకువచ్చారన్నారు. కుల మత వర్గాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసలుకురిపించారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.Show Full Article
Print Article
More On
Next Story
More Stories