అధికారం ఆయనది..సోకు ఈయనది..పాయకరావుపేట అధికార పార్టీలో వింత!

అధికారం ఆయనది..సోకు ఈయనది..పాయకరావుపేట అధికార పార్టీలో వింత!
x
గొల్ల బాబూరావు
Highlights

విశాఖ జిల్లా పాయకరావుపేటలో వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పేరుతో అధికార పార్టీ నాయకుని హల చల్ వైరల్ గా మారుతోంది.

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు అందరికీ సుపరిచితుడే. అయితే, బాబూరావు ఎమ్మెల్యే అయినప్పటీకీ అధికార పార్టీకి చెందిన మరో సినియర్ నేత ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని నియోజకవర్గంలో విపరితంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే కారు కొన్న సదరు నేత ఆ కారుకు నెంబర్ ప్లేట్ కు ఏకంగా ఎమ్మె్ల్యే అనే స్టికర్ వేసుకొని నియోజకవర్గంలో తిరుగుతున్నారని టాక్.

గొల్లబాబూరావు దళితుడుని కావడంతో నియోజక వర్గంలో తనను కొందరు చిన్నచూపు చూస్తున్నారని గతంలోనే ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నేత ఎమ్మెల్యే స్టికర్ వేసుకొని తిరగడంతో బాబూరావు అసహనంతో ఉన్నారని నియోజకవర్గంలోని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే బాబురావు భావిస్తున్నారని సమాచారం.

వైసీపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా తగిన గౌరవం దక్కడం లేదని మదన పడుతున్నారని అంటున్నారు. పోస్టింగులు, బదిలీలు, అన్ని బాబురావుకు తెలియకుండానే జరిగిపోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే లెట‌ర్ హెడ్ కూడా నియోజకవర్గంలోని ఆ సినీయర్ నేత దగ్గరే ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. బాబూరావుకు తెలియకుండా పంచాయితీలు కూడా ఆ సినీయర్ కనుసన్నల్లో నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఆ వైసీపీ సినీయర్ నేత కారుపై ఎమ్మెల్యే అని రాసి ఉన్న ఫోటోను టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారు. ఇది కేవలం టీడీపీ అభిమానులు చేస్తున్న ప్రచారమా? వాస్తవమా లేదా తెలియాలంటే ఎమ్మెల్యే బాబూరావు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories