వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

వైసీపీ పతనం మొదలైందని ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోనని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతే రాజధాని అని బీజేపీ తనకు హామీ ఇచ్చిందని పవన్ స్పష్టం...

వైసీపీ పతనం మొదలైందని ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోనని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతే రాజధాని అని బీజేపీ తనకు హామీ ఇచ్చిందని పవన్ స్పష్టం చేశారు. ఆడపడుచులతో కన్నీళ్లు పెట్టించారని ఆ కన్నీళ్లు ఆనందభాష్పాలయ్యే వరకు పోరాటం ఆపబోనని పవన్ తేల్చిచెప్పారు. మంగళగిరిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు వారి వినాశనం కోసమేనని చెప్పారు.

వైసీపీకి ఇదే తొలి, చివరి అధికారమని ఇకపై వారికి రాష్ట్రంలో అధికారం ఉండదని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి ఎవరూ తరలించలేరని చెప్పారు. నమ్మి ఓట్లు వేస్తే వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. ఈ రోజు అమరావతిని మోసం చేసిన వారు రేపు కడప, విశాఖ ప్రజలను కూడా మోసం చేస్తారని ఆరోపించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలను నమ్మకుండా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు సమస్యలు వస్తే ప్రజలు అండగా ఉంటారన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories