లండన్ బయలుదేరిన జగన్ దంపతులు..

లండన్ బయలుదేరిన జగన్ దంపతులు..
x
Highlights

వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు చిన్న కుమార్తె వర్షారెడ్డితో కలిసి మంగళవారం రాత్రి లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్...

వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు చిన్న కుమార్తె వర్షారెడ్డితో కలిసి మంగళవారం రాత్రి లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కూతురు హర్షారెడ్డిని చూసేందుకు వెళ్లిన జగన్ దంపతులు అక్కడే ఆరు రోజులు గడపనున్నారు. తిరిగి ఈ నెల 26న లండన్ నుంచి తిరుగు పయనం కానున్నారు. నిజానికి జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉంది.

అయితే, ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆయన పర్యటన వాయిదా పడింది. కాగా తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్ వెళ్ళడానికి అనుమతించాల్సిందిగా కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి లండన్ వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories