వచ్చే నెల19 న వైసీపీ భారీ భహిరంగసభ

వచ్చే నెల19 న వైసీపీ భారీ భహిరంగసభ
x
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సోమవారం కీలక భేటీ అయ్యారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సోమవారం కీలక భేటీ అయ్యారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం. అందులో ముఖ్యంగా ఆదివారం రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన బీసీ మీటింగ్ పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాంతో టీడీపీకి సభకంటే ధీటుగా వైసీపీ కూడా భారీ సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల19 న బీసీ గర్జన కు ఏర్పాట్లు చేస్తోంది.

బీసీలు అత్యధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఈసభ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు ఏలూరును ఎంచుకోవాలని చూస్తున్నారు. కాగా బీసీ అధ్యయన కమిటీ 13 జిల్లాలలో చేసిన పర్యటనలు, ఆయా బీసీ కులాల నుండి వచ్చిన విన్నపాలను సమావేశంలో జగన్ కు నేతలు వివరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, జోగు రమేష్‌, పార్థసారథి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేపిదేవి వెంకటరమణ, మార్గని భరత్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories