ఢిల్లీకి ఏపీలో ఓట్ల తొలగింపు పంచాయితీ.. పోటాపోటీగా ఫిర్యాదులు చేయనున్న వైసీపీ.. టీడీపీ

YSRCP And TDP Leaders Complaint To EC About Vote Delete
x

ఢిల్లీకి ఏపీలో ఓట్ల తొలగింపు పంచాయితీ.. పోటాపోటీగా ఫిర్యాదులు చేయనున్న వైసీపీ.. టీడీపీ

Highlights

Delhi: సాయంత్రం ఈసీని కలవనున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Delhi: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓట్ల అంశం కీలకంగా మారింది. ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల గుర్తింపు వ్యవహారం.. టీడీపీ, వైసీపీల మధ్య వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఈ పంచాయితీ ఢిల్లీకి చేరింది. తమ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఓట్ల తొలగింపుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లయింట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం సీఈసీని కలవనున్నారు. దొంగ ఓట్లు, ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

అటు.. వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. తాము కూడా సీఈసీని కలిసి ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఇవాళ సాయంత్రం ఈసీని కలవనున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories