బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంపు..

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంపు..
x
Highlights

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంపు.. బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పెంపు..

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకిచ్చే సొమ్మును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రకటించిన రూ.12,500 రూ.13,500 పెంచి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే రైతు భరోసా అమలు గరిష్టంగా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు రైతు భరోసా వర్తింపు చేసింది. ఒకవేళ అర్హత ఉన్న రైతు మృతి చెందితే.. కుటుంబానికి పథకం వర్తిస్తుందని తెలిపింది. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణి చేయనుంది. ఈ మేరకు రైతు భరోసా సాయం పెంచిన విషయాన్ని రాష్ట్ర మంత్రి కన్న బాబు వెల్లడించారు.

కాగా అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories