Top
logo

వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
Highlights

*మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే *పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలు...

*మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే

*పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలు ఉన్నాయి

*ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50వేలు ఇస్తాం.

*పంటవేసే సమయానికి మే నెలలోనే 12500 ఇస్తాం

*పంటబీమా కోసం రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రిమియం మొత్తం మా ప్రభుత్వమే చెల్లిస్తుంది

*రైతన్నకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తాం

*ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నరకే చార్జీకే కరెంటు అందిస్తాం

*మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం

*పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరలను ప్రకటిస్తాం.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాం.

*నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటుచేస్తాం

*ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం

*మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం

*రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌ ఇస్తాం

*వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డుట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం

*ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. ఏడు లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం.

*కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేవిధంగా చర్యలు.. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టసవరణ చేస్తాం

*కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికి అందేలా చేస్తాం

*నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన మిగిలిన అన్ని హామీలు.. పంట బీమా దగ్గరి నుంచి వడ్డీలేని రుణాల వరకు.. 9 గంటల ఉచిత విద్యుత్‌ నుంచి గిట్టుబాటు ధరల గ్యారెంటీ వరకు.. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా ఏడు లక్షలు రూపాయలు.. ఇలా ప్రతి అంశామూ కౌలు రైతులందరికీ వర్తింపజేస్తాం.

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏటా 12,500 రూపాయలు వీరికి అదనంగా అందజేస్తాం

*పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లి భయపడకూడదు

*పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15వేలు అందిస్తాం

*వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉంటాం

*ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఇస్తాం. ప్రస్తుతం అరకొరగా అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం

*45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా మొదటి ఏడాది తరువాత దశలవారీగా రూ. 75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం

*ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం

*అవ్వా తాతలకు పింఛన్‌ రూ. 3వేల వరకు పెంచుకుంటూపోతాం

*వికలాంగులకు పింఛన్‌ రూ. మూడు వేలు ఇస్తాం

*పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం

*పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి అందిస్తాం

*ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం

*ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం

*ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం

*ఇల్లు ఇచ్చే రోజును ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌

అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం

*వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ, నెలకు 40వేల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ *వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం

*ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యచికిత్స అందజేస్తాం

*హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై..ఇలా ఎక్కడ చికిత్స చేయించుకున్నా.. మెరుగైన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం అన్ని రకాల వ్యాధుల ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తాం

*జబ్బుకు సంబంధించిన ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు

*కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా నెలనెలా రూ. 10వేల పెన్షన్‌ అందజేస్తాం

*ఆరోగ్య శ్రీ సేవలను ఇంకా మెరుగ్గా.. పకడ్బందీగా అందిస్తూనే.. మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతాం

*ప్రస్తుత ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో ఫొటోలు మీ ముందు ఉంచుతాం

*రెండేళ్ల తర్వాత అవే ఆస్పత్రుల దశాదిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, ఫొటోలను మళ్లీ మీ ముందు ఉంచుతాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్యను అవసరమైనమేరకు పూర్తిగా పెంచుతాం

Next Story


లైవ్ టీవి