వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం!
x
Highlights

సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సిబిఐ కి బదిలీ చేయాలనీ కోరుతూ.. వైఎస్ సౌభాగ్యమ్మ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి(బీటెక్ రవి) దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారించింది. ప్రభుత్వ వాదన ఏంటో తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ ను కోరింది. దీనికి అడ్వకేట్ జనరల్ బదులిస్తూ.. సిట్ నిర్వహించిన దర్యాప్తు చివరి దశలో ఉందని కోర్టుకు తెలిపారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తుతో ముందుకు సాగుతోందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు.

కాగా వివేకా హత్య కేసుపై ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. సిట్ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని పేర్కొంటూ.. సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశారు. ఆమె పిటిషన్ ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. సౌభాగ్యమ్మ పిటిషన్‌ పై జనవరి 19 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్‌ను కోర్టు ఆదేశించింది అలాగే విచారణను జనవరి 20 కి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 62 మంది సాక్షులను సిట్ పరిశీలించినప్పటికీ, నిజమైన నేరస్థులు ఎవరు అనే దానిపై ఇంకా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories