YS Sunitha Reddy: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన వివేకా కుమార్తె సునీత

YS Vivekananda Reddy Daughter Sunitha Disclosed Important Information To CBI
x

YS Sunitha Reddy: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన వివేకా కుమార్తె సునీత 

Highlights

YS Sunitha Reddy: ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్‌ భారతి ఫోన్‌ చేశారు

YS Sunitha Reddy: వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకు చార్జిషీటులో కీలక విషయాలు వెల్లడించారు. తన తండ్రి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, సీఎం జగన్ పేరుని ప్రస్తావించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనకు చెప్పారని తెలిపారు సునీత.

2019 మార్చి 22న వైఎస్ భారతి నాకు ఫోన్ చేశారని.. ఇంటికి వచ్చి నన్ను కలుస్తానన్నారని తెలిపారు. నేను సైబరాబాద్, కడప కమిషనరేట్‌కి భారతికి చెప్పానని.. ఎక్కువ సమయం కాకుండా తొందరగా కలిసి వెళ్తానని చెప్పి వైఎస్ భారతి ఇంటికి వచ్చారన్నారు. ఆమె వెంట విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో ఆశ్చర్యపోయానని తెలిపారు. లిఫ్ట్ వద్దనే వారితో మాట్లాడానని...ఆ సమయంలో భారతీ కాస్త ఆందోళనగా కనిపించారని తెలిపారు.

ఇకనుంచి ఏం చేసినా సజ్జలతో టచ్‌లో ఉండాలని భారతీ నాకు చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాలని ప్రజల రామకృష్ణారెడ్డి నాతో అన్నారు. ఆయన ఆలోచన నాకు కాస్త ఇబ్బందిగా అనిపించినా వీడియో చేసి పంపించా. ఆ తరువాత ఈ వీడియో కాకుండా ఈ అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు. ఆ ప్రెస్‌మీట్‌లో జగనన్నతో పాటు అవినాష్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. అందుకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాను. అవినాష్ అభ్యర్థిత్వాన్ని మా నాన్న కోరుకోలేదు. మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి. నాన్న చనిపోయాక ఇచ్చిన ఫిర్యాదు పై నేను సంతకం చేయలేదు” అని సంచలన విషయాలు బయట పెట్టారు సునీత.

Show Full Article
Print Article
Next Story
More Stories