వైఎస్ వివేకా హత్యకేసు : చిక్కుల్లో వర్ల రామయ్య

వైఎస్ వివేకా హత్యకేసు : చిక్కుల్లో వర్ల రామయ్య
x
Highlights

వైఎస్ వివేకా హత్యకేసు : చిక్కుల్లో వర్ల రామయ్య వైఎస్ వివేకా హత్యకేసు : చిక్కుల్లో వర్ల రామయ్య

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారని సిట్ అధికారులు భావించారు. వర్ల రామయ్య ఏ ఆధారాలతో వివేకానందరెడ్డి హత్యపై ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో సీఎఆర్పీసీ 160 కింద కడప సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.. తన వద్దవున్న సాక్ష్యాలతో సిట్ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అటు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా ఎస్పీని కలిశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే విషయంపై వీరు ఎస్పీతో మాట్లాడారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories