Andhra Pradesh: వైఎస్ విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ

YS Vijayamma 5 Pages Open Letter on YS Viveka Reddy Death Issue
x

వైస్ విజయమ్మ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందే- విజయమ్మ

Andhra Pradesh: ఏపీ రాజకీయాలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో ఈ కేసుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ స్పందించారు. అధికార పార్టీపై చేస్తోన్న కామెంట్లకు బహిరంగ లేఖతో సమాధానమిచ్చారు.

వైఎస్‌ వివేకా హత్య కేసుపై మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయి. వివేకా కూతురు సునీత వ్యాఖ్యలు విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారాయి. దీంతో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. జగన్‌ ప్రభుత్వం వివేకా హత్య కేసును పట్టించుకోవడం లేదంటూ కామెంట్లు చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతోంది. విపక్షాల వ్యాఖ్యలకు అధికార పార్టీ దీటుగా బదులిచ్చింది. కేసు ఉన్నది కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలో అని.. హత్య జరిగిన నాడు టీడీపీ ఏం చేసిందంటూ ప్రశ్నలు సంధించారు.

తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కూడా ఈ అంశంపై స్పందించారు. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకాను ఎవరు హత్య చేశారో నిగ్గు తేల్చాల్సిందే అని డిమాండ్ చేశారు. హత్య తర్వాత రెండున్ననర నెలల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా చేసిన ఆదినారాయణ రెడ్డి పాత్రపై అనుమానాలున్నాయన్నారు. ఇక సీబీఐ దర్యాప్తు కేంద్రం పరిధిలోనిదని ఇందులో ఏపీ ప్రభుత్వం చేయగలిగేది ఏముందని విజయమ్మ ప్రశ్నించారు. తిరుపతి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు.

వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలనే వివేకా కుమార్తె సునీత డిమాండ్ చేస్తున్నారని.. ఇదే తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయమని చెప్పారు. ఈ విషయంలో తమ మద్దతు సునీతకు ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఇక షర్మిల పార్టీపై కూడా స్పందించిన విజయమ్మ తెలంగాణలో వైఎస్సార్సీపీ కార్యకలాపాలు వద్దని జగన్ నిర్ణయించుకోవడం వల్లే పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ఇందులో జగన్‌, షర్మిల మధ్య విభేదాలు లేవని... అభిప్రాయ భేదాలే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories