తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోందా?..అసలు కథ ఏంటి!

YS Sharmila New Party issue in Telangana
x

YS Sharmila (File Image)

Highlights

* జూన్‌లో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్‌ షర్మిల..? * షర్మిల కొత్త పార్టీ‌పై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం * ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు

తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోందా? ఏపీ సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల నిజంగానే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీపై ఊహాగానాలే నిజంకాబోతున్నాయా? షర్మిల పార్టీ పెడతారంటూ ఎందుకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? జరగబోతోంది?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులక్రితం జరిగిన ఈ ప్రచారాన్ని ప్రెస్‌నోట్‌‌ ద్వారా షర్మిల ఖండించింది. అయితే ఇప్పుడా ప్రచారం మళ్లీ జోరందుకుంది. వైఎస్ షర్మిల జూన్‌లో పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్పె ట్టేందుకు షర్మిల సిద్ధం అయినట్లు తెలుస్తోంది

అంతేకాదు, ఇవాళ వైఎస్ అభిమానులు, తన అనుచరులతో వైఎస్ షర్మిల సమావేశం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోటస్ పాండ్‌లో కార్యకర్తలతో సమావేశంకానున్నారు. ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాదంటూ షర్మిల ఫొటోలతో స్లోగన్లను సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాదు, ఛలో లోటస్ పాండ్ పేరుతో సోషల్మీడియాలో పోస్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే, వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్‌ పాండ్‌‌ను ఖాళీ‌చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలో షర్మిల కొత్త ఇంటిని తీసుకున్నట్లు సన్నిహితులుచెబుతున్నారు. త్వరలోనే లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలి ఇంటికి షర్మిల మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్‌, అలాగే ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారన్న ఊహగాహానాలు జోరందుకున్నాయి. సో ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories