YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం

YS Sharmila Is All Set To Join The Congress
x

YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం

Highlights

YS Sharmila: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హస్తం గూటికి..!

YS Sharmila: అందరు ఊహించిందే జరగబోతోంది. ఎన్నో రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజం కాబోతోంది. వైఎస్సార్ బిడ్డ, షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు రేపే ముహుర్తం ఖరారు అయింది. రేపు ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. రాహుల్, సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వనున్నారు. రేపు ఢిల్లీకి రావాలని షర్మిలకు పిలుపు రావడంతో.. అధికారికంగా జాయిన్ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపు హస్తం గూటికి చేరనుండడం గమనార్హం.

షర్మిల కాంగ్రెస్‌లో జాయిన్ కాబోతున్నారనే వార్తలు గత రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఐతే తొలుత ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లోనే ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపారు. తెలంగాణ ఎన్నికల ముందు.. కాంగ్రెస్ అధిష్టానంతో షర్మిల చర్చలు కూడా జరిపారు. పలు దఫాలు డీకే శివకుమార్‌ను కలిసివచ్చారు షర్మిల. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తెలంగాణ కన్నా.. ఏపీలోనే షర్మిల సేవలను వినియోగించుకోవాలని హైకమాండ్ అభిప్రాయపడింది. అందుకు ఆమె కొంత నిరాకరించడంతో.. పార్టీలో చేరిక ఆలస్యమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories