YS Sharmila: జగన్ ఆయన పార్టీని.. రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టుపెట్టారు

YS Sharmila Comments On Jagan
x

YS Sharmila: జగన్ ఆయన పార్టీని.. రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టుపెట్టారు

Highlights

YS Sharmila: ప్రత్యేక హోదా అడగకుండా బీజేపీకి బానిసలయ్యారు

YS Sharmila: ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం జగన్‌తో పాటు అందరూ బీజేపీకి బానిసలుగా మారారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతుందని అన్నారు. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడంటూ హాట్ కామెంట్స్ చేశారు షర్మిల. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో ఒక్క రోజు కూడా హోదా అడగలేదని ఆరోపించారు.. రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories