ఏపీలో పొలిటికల్ గేమ్ ఛేంజర్‌గా వైఎస్ షర్మిల

YS Sharmila as a Political Game Changer in AP
x

ఏపీలో పొలిటికల్ గేమ్ ఛేంజర్‌గా వైఎస్ షర్మిల

Highlights

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించిన హైకమాండ్

YS Sharmila: అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు దక్కాయి. ఏపీ అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక నిర్ణయం ప్రకటించింది. ఏపీలో కాంగ్రెస్‌ని గాడిలో పెట్టే బాధ్యతలను షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణంగా ఉన్న షర్మిల.. ప్రస్తుతం ఏపీపై కాంగ్రెస్ విసిరిన అస్త్రంగా మారారు.

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసే బాధ్యతలను షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీలో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ లేదనే వాదన ఉంది. అయితే ఏపీలో ఇప్పటివరకు రెండు ఎన్నికలు ముగిశాయి. ముచ్చటగా మూడవ ఎన్నిక 2024లో వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏమైనా ఆశ ఉంటుందని వైఎస్ కుటుంబం నుంచే షర్మిలను బరిలోకి దించినట్లు టాక్.

అయితే, తాను స్థాపించిన YSRTPని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఈనెల నాలుగోతేదీన హస్తం పార్టీలో జాయిన్‌ అయ్యారు. ఈ తర్వాత ఏపీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో, ఆంధ్రా రాజకీయం హీటెక్కినట్లయింది. రాష్ట్ర విభజన తర్వాత చెల్లాచెదురైన కాంగ్రెస్‌కు జీవం పోసే బాధ్యతలని ఇప్పుడు షర్మిలకు అప్పగించారు. ఇక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుకు CWC ప్రత్యక ఆహ్వానితుడిగా నియమించారు.

ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథం వైపు నడిపించేందుకు ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల గేమ్ ఛేంజర్‌గా మారనున్నారా అనే చర్చ స్టార్ట్ అయింది. మరో వైపు ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీలో టికట్ దక్కని నేతలందరూ కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తోన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టికెట్ దక్కని నేతలు త్వరలోనే.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ షర్మిల పోటీ చేయలేదు. ఆమె తనను తానుగా రాజకీయంగా రుజువు చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని కూడా బతికించాలి. ఒక విధంగా ఇది టఫ్ టాస్క్. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆశలు, షర్మిల ధీమా ఏపీలో కలిసివస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories