నేవి డేకు నౌకాదళం సన్నాహాలు

నేవి డేకు నౌకాదళం సన్నాహాలు
x
Navy Day
Highlights

నేవి డే పురస్కరించుకోని తూర్పు నౌకాదళం సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబరు 4న జరిగే నేవీ డే సందర్భంగా నౌకాదళం శక్తి, సామర్థ్యాలు ప్రజలకు ప్రత్యక్షంగా...

నేవి డే పురస్కరించుకోని తూర్పు నౌకాదళం సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబరు 4న జరిగే నేవీ డే సందర్భంగా నౌకాదళం శక్తి, సామర్థ్యాలు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడానికి వీలుగా సముద్రంలో విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈసారి కూడా విన్యాసాల కోసం బీచ్‌లో రిహార్సల్స్‌ నిర్వహించింది తూర్పు నౌకాదళం.

నేవిడే కు తూర్ప నౌకాదళం సిద్దం అయ్యింది. దేశానికి నౌకాదళం చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. భారత్, పాక్ యుద్ధం సందర్భంగా మన నౌకాదళం మెరుపు దాడితో పాకిస్థాన్‌ను గడగడలాడించింది.

భారత యుద్ధ నౌకలు 1971 డిసెంబర్ 4న కరాచీ హార్బర్‌పై దాడి చేశాయి పాక్‌ను దెబ్బతీశాయి. నాటి నుంచి డిసెంబర్ 4న నేవీ డే జరుపుకొంటున్నారు.ఈ నేవి డే చుసేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచుస్తుంటారు .

దీనితో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిహార్స్ నిర్వహించారు . నేవి చేసే విన్యాసాలు చూసేందుకు బీచ్ రోడ్లు లో జనాలు కిక్కిరిపోయారు . హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, నేవి పైరింగ్ సిబ్బంది చేసే ఆపిరేషన్లు విపరితంగా ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 4 జరిగే ఈ ఉత్సవాలకు సీఎం జగన్ హజరు కాబోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories