'బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం'ల జాబితాలో జగన్‌ స్థానం ఎంతో తెలుసా?

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జాబితాలో జగన్‌ స్థానం ఎంతో తెలుసా?
x
Highlights

బెస్ట్ పెర్ఫామింగ్ ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది...

బెస్ట్ పెర్ఫామింగ్ ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే వెల్లడించింది. మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌ 'బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం'ల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.

13% తో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ (బీజేపీ), 11% తో రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆమ్ ఆద్మీ), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌) ఉండగా.. 10% తో మూడో స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, 7% తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( వైఎస్ఆర్ కాంగ్రెస్ ) నాలుగో స్థానంలో నిలిచారు. 6% తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ ) , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( బిజూ జనతా దళ్ )ఐదో స్థానంలో నిలిచారు. 4% తో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (బీజేపీ) 6 స్థానంలో నిలిచారు. 3% తో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్) , హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ( బీజేపీ ) లు 7 స్థానం సాధించారు.

పరిపాలనా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. కాగా ఈ 'బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం' సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్‌ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ను చూపించారు. కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ సీఎంల జాబితాలో జగన్ చేరడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories