logo

ఢిల్లీకి వైయస్ జగన్.. పార్టీ అగ్రనేతలకు గదుల కేటాయింపు..

ఢిల్లీకి వైయస్ జగన్.. పార్టీ అగ్రనేతలకు గదుల కేటాయింపు..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడ జరిగే జాతీయ పత్రికా సదస్సులో జగన్ పాల్గొననున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తాను ఇండియాలో లేని సమయంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు, జరగాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నూతన గృహప్రవేశం చేసిన జగన్.. నిన్న సాయంత్రం నుంచి ముఖ్యనేతలు మినహా ఎవ్వరిని కలవలేదని తెలుస్తోంది. కాగా అగ్రనేతలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నేడు గదులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ తో భేటీ కానున్నారు.

లైవ్ టీవి

Share it
Top