Amaravati: కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎం

Amaravati: కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎం
x
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎం
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కలను నిజం చేసే దిశగా శరవేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కలను నిజం చేసే దిశగా శరవేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ళ పట్టాల పంపిణీ, కరోనా వైరస్, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఇళ్ళ స్థలాల కోసం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో లే అవుట్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా లకు ప్రత్యేక అధికారులుగా నియమించిన ఉన్నతాధికారులు సంబంధిత జిల్లాల్లో పర్యటించి ఇళ్ళపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారిం చాలన్నారు. అనుమతులు, ఆర్ధిక వనరులు కేటాయింపు విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి అండగా ఉండాలన్నారు.

అర్బన్‌ పరిధిలో సైతం సెంటు స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్‌లు అభివృద్ధి పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేసిన స్థలంలో సంబంధిత లబ్దిదారులను నిల్చోపెట్టి ఫోటోలు తీయాలన్నారు. కరోనా వైరస్‌ నిరోధించటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

తెలంగాణ లో ఇప్పటికే ఒక కేసు నమోదు అయ్యిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. కోరనా వైరస్‌ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావల్సిన అవసరం లేదని కానీ ఎలాంటి పరిస్థితినైన ఎదుర్కోనేందుకు ముందస్తుగా ఏర్పట్లు సిద్దం చేసుకోవాలన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories