Top
logo

ఇదే నా విజన్‌ : వైఎస్‌ జగన్‌

ఇదే నా విజన్‌ : వైఎస్‌ జగన్‌
Highlights

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ...

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్విటర్‌లో ట్వీట్ చేశారు. పారదర్శక పాలనతో, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అవినీత రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వానలు పడి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Next Story