ఢిల్లీలోనే జగన్ .. చివరి నిమిషంలో ఖరారైన కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు

ఢిల్లీలోనే జగన్ .. చివరి నిమిషంలో ఖరారైన కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు
x
ఏపీ సీఎం జగన్
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు చివరి నిమిషంలో ఖరారు అయ్యాయి. దీంతో ఆయన తిరిగి అమరావతి ప్రయాణాన్ని వాయిదా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు చివరి నిమిషంలో ఖరారు అయ్యాయి. దీంతో ఆయన తిరిగి అమరావతి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్ ఆ తర్వాత అక్కడే బస చేశారు. కొందరు కేంద్ర మంత్రులకు ఆయన కలవాలని భావించగా.. ఎవరి అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రావాలని భావించారు. కాగా.. న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేషీ నుంచి పిలుపు వచ్చింది.

దీంతో అమరావతి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యాయ శాఖా రవిశంకర్ ప్రసాద్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారైంది. మూడు రాజధానుల అంశంలో న్యాయరాజధాని హైకోర్టును కర్నూలుకు తరలించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. న్యాయశాఖ మంత్ర రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన అనంతరం నితిన్ గడ్కరీతో సహా పలువురు మంత్రులను కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది.

గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు అర గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అమిత్‌ షాతో భేటీ అయి సుమారు 40 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories