కాసేపట్లో వైసీపీ రెండో జాబితా..

కాసేపట్లో వైసీపీ రెండో జాబితా..
x
Highlights

వైసీపీ అధినేతవైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని తన నివాసం నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌...

వైసీపీ అధినేతవైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని తన నివాసం నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శనివారం రాత్రి 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా..

మిగిలిన 16 ఎంపీ స్థానాలకు 175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల తొలి బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్ల పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories