ఏపీ అసెంబ్లీలో రైస్ రగడ..సన్నభియ్యం ఇస్తామని చెప్పలేదన్న జగన్

ఏపీ అసెంబ్లీలో రైస్ రగడ..సన్నభియ్యం ఇస్తామని చెప్పలేదన్న జగన్
x
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Highlights

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాము నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే పంపిణి చేస్తామని గతంలో చెప్పామని ఖచ్చితంగా చేసి తీరుతామన్నారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తోందని సీఎం అన్నారు. కాగా మంగళవారం అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం సరఫరా అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ముందుగా బియ్యం గురించి నాలెడ్జ్‌ పెంచుకొవాలని సూచించారు.

మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని చెప్పిన సీఎం.. రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణి చేస్తామని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకం ప్రారంభించామని.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో పంపిణి చేసిన బియ్యానికి తాము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పంపిణి చేస్తున్న బియ్యానికి చాలా తేడా ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ప్రజలెవ్వరూ అమ్ముకోకుండా తినాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories