అందరూ బాగుండాలనే.. ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు

అందరూ బాగుండాలనే.. ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు
x
Highlights

ప్రస్తుతం అమరావతిలో రైతుల రగడ రగులుతూనే ఉండగా తాజాగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అమరావతిలో రైతుల రగడ రగులుతూనే ఉండగా తాజాగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.. అందరూ బాగుండాలి, ప్రతి ప్రాంతము బాగుండాలి అని తాను కోరుకుంటున్నానని.. అందరికి నీళ్లు, నిధులు సమానంగా దక్కాలనే .. అన్ని ప్రాంతాలకు అధికారం దక్కాలనే ఉంద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామన్నామని మూడు రాజధానుల అంశం చెప్పకనే చెప్పారు. 'వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ' పథకం పైలట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి శ్రీకారం చుట్టారు. ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లల్లోనే.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు వున్నవారిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇప్పటినుంచి ఇచ్చే ప్రతి ఆరోగ్యశ్రీ కార్డుకు QR కోడ్ ను ఏర్పాటు చేశామని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి గ్రామ సచివాలయం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణి చేస్తున్నామని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానని.. అప్పులు చేయకుండా ఆరోగ్యం ఎలా అందించాలో ఆలోచించానని.. అదికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. పుట్టుకతో చెవుడు, మూగ ఉన్న పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని.. రెండు చెవులకు ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఏప్రిల్ 1వ తారీకు నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో మందులను ప్రవేశ పెడతామన్నారు. మార్చి నెలాఖరుకల్లా 1060 .. '108 , 104' అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

మే నెలాఖరుకు మెడికల్ రంగానికి సంబంధించిన అన్ని పోస్టులను భర్తీ చేసి.. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, నర్సులు లేరన్న లోటును తీరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా నలభై వేల పైచిలుకు పిల్లలకు కళ్లద్దాలు ఇచ్చామన్నారు. ఫ్రిబ్రవరి1 తారీకు నుంచి అవ్వా తాతలకు కూడా కళ్ళద్దాలను పంపిణి చేస్తామని ప్రకటించారు. మార్కాపురం, పలాసలో కిడ్నీ సెంటర్లను త్వరలో నిర్మిస్తామని వెల్లడించారు. పలాసలో ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు.

అలాగే పులివెందుల, మచిలీపట్టణం, మార్కాపురంలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని చెప్పారు. ఈనెల 9వ తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి గవర్నమెంటు పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్పు చేయబోతున్నట్టు సీఎం స్పష్టం చేశారు. నాడు- నేడు తో పాఠశాలల ఆధునీకరణ చేపట్టామని వెల్లడించారు.

దేవుడి దయవల్ల ప్రజల ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని ప్రజలకోసమే వినియోగిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు సీఎం. అనంతరం గేదెల రమేష్, మహమ్మద్ రఫీక్ అహ్మద్ , జివ్వారపు రమేష్ ,యువ్వ రాజేశ్వరి లకు ముఖ్యమంత్రి హెల్త్ కార్డులు అందజేశారు. అలాగే నీలి నిత్య సంతోషిణి, పి రేణుకాదేవి లకు స్పెషల్ పెన్షన్ లు అందజేశారు ముఖ్యమంత్రి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస(నాని), గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories