logo

నేడు అనంతలో 'సమర శంఖారావం'.. ఆ మూడు సీట్లపై క్లారిటీ..

నేడు అనంతలో

పాదయాత్ర అనంతరం సమర శంఖారావాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేడు(సోమవారం) అనంతపురం జిల్లాలో జరగనున్న సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటలకు అనంతపురం నగరానికి చేరుకోనున్న జగన్‌ అక్కడ శ్రీ 7 కన్వెన్షన్‌ హాలుకు చేరుకుని వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్‌ లేల్యాండ్‌ షోరూమ్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో 'సమర శంఖారావం' సభలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ప్రకటన చేశారు.

కాగా 2019 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ సమర శంఖారావం కార్యక్రమం జరగనుంది. ఆయన ఇప్పటికి చిత్తూర్, కడప జిల్లాలు పూర్తి చేశారు.ఇదిలావుంటే ఇటీవల పార్టీలో చేరిన పోలీస్ అధికారి మాధవ్ ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగాను, అనంతరపురం పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు ఎవరికీ ఇచ్చేది పార్టీ నేతలకు క్లారిటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

లైవ్ టీవి

Share it
Top