logo

నేడు కడపలో జగన్ సమరశంఖారావం..

నేడు కడపలో జగన్ సమరశంఖారావం..
Highlights

పాదయాత్ర తరువాత వైసీపీ అధినేత వైయస్ జగన్ సమరశంఖారావంతో ప్రజల మధ్య కొచ్చారు. కేడర్‌ను కార్యోన్మోఖులను...

పాదయాత్ర తరువాత వైసీపీ అధినేత వైయస్ జగన్ సమరశంఖారావంతో ప్రజల మధ్య కొచ్చారు. కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతిలోని రెండు సమరశంఖారావం సభల్లో పాల్గొన్నారు.. ఈ క్రమంలో నేడు కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే సమరశంఖారావం వైఎస్‌ జగన్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో రానున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11 గంటలకు కడపకు సమీపంలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

అనంతరం మ. 1 గంటకు బూత్‌ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో కడప మున్సిపల్‌ స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు. ఏ బహిరంగ సభలకూ లేని విధంగా ఈ సభకు ఇలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే తిరుపతి సభలో పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించిన జగన్.. నేడు మరో సంచలన నిర్ణయం ప్రకటిస్తారని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top