వెలిగొండ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

వెలిగొండ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
x
Highlights

ఇప్పటికే పోలవరంపై రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే...

ఇప్పటికే పోలవరంపై రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే బృహత్తర బహుళార్ధకసాధక ప్రాజెక్ట్ వెలిగొండ. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లాలని సంచలన నిర్ణయం తీసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో మిగిలిపోయిన పనులను రూ.553.13 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌–ఓపెన్‌ పద్ధతిలో 18 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో జలవనరుల శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 23 నుంచి బిడ్‌ లు దాఖలు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 7 సాయంత్రం ఐదు వరకు టెండర్‌ డాక్యుమెంట్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 9న సాయంత్రం ఐదు గంటల్లోగా బిడ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 11న బిడ్‌ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను 'ఎల్‌–1'గా ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారని జలవనరుల శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.

వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్‌సీసీ–సీపీపీఎల్‌ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. ఈ సొరంగం దూరం మొత్తం 18.8 కిలోమీటర్లు.. అయితే గడువు ప్రకారం 2020 మార్చి నాటికి సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. 2018 ఆగస్టు వరకు 10.750 కి.మీ.ల పనులు మాత్రమే పూర్తి చేసింది ఈ సంస్థ. అందుకు గాను రూ.489 కోట్లను చెల్లించింది ప్రభుత్వం. పనుల్లో వేగం పెంచని కారణంగా హెచ్‌సీసీ–సీపీపీఎల్‌పై గతేడాది 60 సీ కింద తప్పించింది అప్పటి ప్రభుత్వం. ఆ సమయంలో పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఉందని చెప్పినా.. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచారు. అనంతరం రూ.570.58 కోట్ల అంచనాతో రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.597.35 కోట్లకు ఈ పనులను అప్పజెప్పించింది. పనులు గడువులోగా పూర్తి చేసినట్టయితే రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు అదనంగా 4.69 శాతం ఇస్తామని చెప్పింది. ఈ కాంట్రాక్టుపై రివర్స్ టెండరింగ్ కు వెళుతోంది జగన్ సర్కార్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories