నేడు పూలే వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్‌

నేడు పూలే వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్‌
x
Highlights

నేడు జ్యోతిరావు పూలే వర్థంతి సందర్బంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...

నేడు జ్యోతిరావు పూలే వర్థంతి సందర్బంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఏర్పాట్లను మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు పార్ధసారథి, మల్లాది విష్ణు, జోగి రమేష్, సీఎం ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ పరిశీలించారు.

కాగా జ్యోతిరావు గోవిందరావు పూలే ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త.. అలాగే మహారాష్ట్ర ప్రఖ్యాత రచయితల్లో ఆయన కూడా ఒకరు. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు పూలే. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. అటువంటి సంఘసంస్కర్త వర్ధంతి నేడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories