ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వండి: సీఎం జగన్

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వండి: సీఎం జగన్
x
వైఎస్ జగన్, నరేంద్రమోదీ
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధానికి నివేదించారు. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, విభజన హామీలు పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రప్రభుత్వం ఉగాది రోజున 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. పేదలందరికీ ఇళ్లు అందజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు ప్రధానికి తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని 800 ఎకరాలు ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా జగన్ కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు 2021 నాటికి పూర్తి చేయాలనే ధ్యేయంగా ఉన్నామని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో సీఎం పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో అన్ని కుటుంబాలను పునరావాస పనులను షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందని వెల్లడించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్లు అవసరమవుతుందని, పోలవరం అంచనాలు రూ.55,549 కోట్లకు చేరిందని చెప్పారు.

ఫిబ్రవరి 2019న పోలవరం అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్రజలవనరుల శాఖ అంచనా వేసిందని సీఎం గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులో రూ.3,320 కోట్లు రావాల్సి ఉందని వాటిని విడుదల చేయాలని సంబంధిత శాఖను ఆదేశించాలని కోరారు.

పునర్విభజన చట్టంలో ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సీఎం గుర్తు చేశారు. కాగ్‌ అంచనా ప్రకారం ఏపీలో రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా ఉందని చెప్పారు. కేంద్రం నుంచి రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని మోదీకి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్రాలకు 'హోదా' ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదని 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్న ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హోదా అంశమైనందున కేంద్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories