27న జగన్ గృహప్రవేశం.. రేపు టీడీపీ ఎమ్మెల్యే..

27న జగన్ గృహప్రవేశం.. రేపు టీడీపీ ఎమ్మెల్యే..
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న నూతన ఇంటిలోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారని ఆ పార్టీ కీలక...

ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న నూతన ఇంటిలోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారని ఆ పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గృహప్రవేశం అనంతరం పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.కార్యక్రమానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులందరికీ ఆహ్వానాలు పంపినట్టు ఆయన చెప్పారు. కాగా గృహప్రవేశానికి కేవలం కుటుంబసభ్యులు, బాంధవులు మాత్రమే రావలసిందిగా ఆహ్వానపత్రికలు అందించినట్టు సమాచారం. కాగా రేపు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జగన్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories