ధర్మాడి సత్యంను సన్మానించిన జగన్‌

ధర్మాడి సత్యంను సన్మానించిన జగన్‌
x
Highlights

కుచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడం కష్టం అని నిపుణులు చెప్పినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీసి చూపించాడు. ఎంతో...

కుచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడం కష్టం అని నిపుణులు చెప్పినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీసి చూపించాడు. ఎంతో కష్టతరమైన బోటు వెలికితీతను సులభంగా ముగించిన ధర్మాడి సత్యంను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవంగా సన్మానించింది. ఈ గౌరవాన్నిధర్మాడి సత్యం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పొందారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి ధర్మాడి సత్యం, ఆయన బృందం హాజరయ్యారు. దీంతో ఆ వేదికపై వారిని ఆహ్వానించిన సీఎం జగన్ వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. నిపుణులు కూడా చేయలేని పనిని సులువుగా చేసి బోటును వెలికి తీసారంటూ ధర్మాడి సత్యంని, తన బృందాన్ని కొనియాడారు.

రాజమండ్రిలోని కుచ్చులూరు వద్ద బోటు ప్రమాదానికిగురై ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోయిన విషయం అందరికీ తెలిసందే. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున్న పడ్డాయి. బోటు బోల్తా పడినప్పుడు చనిపోయిన వారిని బయటికి తీసుకురావడానికి రెస్క్యూ టీం చాలా రకాలుగా ప్రయత్నించారు. కొంత మంది ప్రాణాలను కాపాడి వారి కుటుంబాలకు అప్పగిస్తే, మరి కొంతమందిని విగత జీవులుగా వారి కుటుంబాలకు అప్పగించారు. మరి కొంతమంది మాత్రం ఆ బోటులోనే చిక్కుకుని ఉండిపోయారు. ఆ తరువాత ప్రభుత్వం తరుఫుల ఎన్నో రెస్క్యూ టీంలు బోటును వెలికి తీయడానికి ప్రయత్నించి విఫలయం అయ్యారు. అలాంటి సమయంలో బోటును వెలికి తీయడానికి ఎంతో ధైర్యంతో ముందుకొచ్చారు ధర్మాడి సత్యం, అతని టీం సభ్యులు. వారం రోజులు కష్టపడి ఆ బోటును విజయవంతంగా బయటికి తీయగలిగారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories