నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్
x
YS Jagan, Nimmagadda Ramesh Kumar (File Photo)
Highlights

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు తరువాత ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు తరువాత ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ప్రకటించుకున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కమిషనర్‌గా రమేశ్ కుమార్ కొనసాగవచ్చని ఉన్నత న్యాయస్థానం చెప్పలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు హైకోర్టు తీర్పును స్టే చేయాలని కోరామని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తెలియజేశామని ఆయన చెప్పారు. ఎస్ఈసీని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు.. కూడా ఈ నిబంధనే వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే అంతకుముందు ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తనకు వాహనాలు పంపాలని అధికారులకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేశారు.

నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. అంతేకాదు నూతన ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ పరిధిలో తమకున్న విశాక్షాణాధికారంతో చేశామని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది.నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories