జగన్ సర్కారుకు హైకోర్టులో త్రిబుల్ షాక్

జగన్ సర్కారుకు హైకోర్టులో త్రిబుల్ షాక్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సర్కారుకు ఒకే రోజు మూడు షాకుల మీద షాకులు తగిలాయి.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సర్కారుకు ఒకే రోజు మూడు షాకుల మీద షాకులు తగిలాయి.రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగుల వేసిందని జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అలాగే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌‌ను వేటును కూడా ఎత్తివేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం అరెస్టయిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని సీబీఐను ఆదేశించింది. డాక్టర్ సుధాకర్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

సుధాకర్ వ్యవహారంపై ఎనిమిదవ వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. వైద్యుదు సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న ఉన్నత న్యాయస్థానం దీని వెనుక భారీ కుట్ర ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై నమ్మకం విశ్వాసం లేదని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, సస్పెన్షన్ విధించిన కాలానికి సంబంధించి కూడా ఆయనకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు పక్కన పెట్టింది.

ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 623ను ధర్మాసనం రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న వైసీపీ రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున కోర్టుకు న్యాయవాది వాదనలు విన్పించారు. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని హైకోర్టు హెచ్చరించింది... ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 28న సుమోటో కేసుగా హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories