మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం.. సంగం బ్యారేజీకి గౌతమ్‌ పేరు...

YS Jagan Going to Participate in Mekapati Goutham Reddy Samsarana Sabha | Live News
x

మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం.. సంగం బ్యారేజీకి గౌతమ్‌ పేరు...

Highlights

YS Jagan: గౌతమ్‌రెడ్డి మంత్రి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ...

YS Jagan: సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించున్నారు. వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నెల్లూరులోని మంత్రి మరణించిన సమయంలోనూ.. అదే విధంగా అంత్యక్రియలకూ సీఎం హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సభలో గౌతమ్ కు సంతాపం ప్రకటించారు. సభకు ఒక రోజు సెలవు ప్రకటించారు. సంతాపం ప్రకటించే సమయంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్‌ పేరు పెడతానని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన విధంగా గౌతమ్ సంస్మరణార్దం మేకపాటి ఇంజనీరింగ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానం ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వంలో అవకాశం ఇస్తారా..? లేక వేరే అవకాశం ఇస్తారా అన్నది.. ఉత్కంఠగా మారింది. ఆత్మకూరు అసెంబ్లీ సీటు గౌతమ్ మరణంతో ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫై చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది కూడా. మరో అయిదు నెలల్లో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఉప ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గౌతమ్ సతీమణి రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందుకొస్తే...గౌతమ్ స్థానంలో ఆయన సతీమణికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అదే కుటుంబం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించటం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ పొలిటిషీయన్. ఆయన పలు మార్లు ఎంపీగా పోటీ చేశారు. ఆయన్ను రాజ్యసభకు పంపిచేందుకు సీఎం జగన్ సిద్దమైనా.. ఆయన ఆరోగ్యం- వయసు కారణంగా ఆయన రాజ్యసభ పదవికి సిద్ద పడకపోవచ్చని నెల్లూరు జిల్లా నేతలు చెబుతున్నారు. దీంతో మరి మంత్రి పదవి ఎవరికి ఇస్తారు.. గౌతమ్ సతీమణికి ఇస్తారా లేదా.. సీనియర్ రాజకీయ నేతగా రాజమోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారా అన్నది కేబినెట్ విస్తరణలో తేలనుంది. దీనిపై రేపే ఆ కుటుంబానికి క్లారిటీ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories