నేడు మూడు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం.. షర్మిల, విజయమ్మ..

నేడు మూడు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం.. షర్మిల, విజయమ్మ..
x
Highlights

మానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ తన ప్రచారానికి మంగళవారం స్వల్ప విరామం ఇచ్చారు. నేడు(బుధవారం) ఆయన మూడు జిల్లాల్లో...

మానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ తన ప్రచారానికి మంగళవారం స్వల్ప విరామం ఇచ్చారు. నేడు(బుధవారం) ఆయన మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, ఉదయం 11.30 గంటలకు విశాఖ జిల్లాలోని పాయకరావుపేట, మధ్యాహ్నం 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం, 3.30 గంటలకు మండపేటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మూడు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో జగన్ ప్రసంగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు ఈనెల 29నుంచి జగన్ సోదరి షర్మిల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఆమె అమరావతిలోని మంగళగిరి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అలాగే జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా వచ్చే నెల 2 లేదా 3 తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories